​రెండు రోజుల పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని వెల్లడి

​జగ్గయ్యపేట, జూన్ 12 (యువ గళం న్యూస్ ):
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జగ్గయ్యపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఏపీ పీఏసీ కమిటీ సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) హాజరుకానున్నారు. ప్రభుత్వం అమలు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈరోజు (శుక్రవారం) తిరుపతిలో ఈ సభ జరగనుంది.
​ఈ నేపథ్యంలో జూన్ 12 (శుక్రవారం), జూన్ 13 (శనివారం) రెండు రోజుల పాటు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్యపేటలోని తన నివాసంలో అందుబాటులో ఉండరని ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరడమైనది.