స్వయం ఉపాధికి అండగా నిలిచిన టీడీపీ నేతలు ​రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు

వత్సవాయి, జూన్ 12 యువ గళం న్యూస్ :
మండలంలో తెలుగుదేశం పార్టీ సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతోంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా పార్టీ నాయకులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వత్సవాయి గ్రామానికి చెందిన ఆలేటి పద్మ కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించేందుకు మండల పార్టీ ఉపాధ్యక్షులు దారెల్లి చిరంజీవి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఆమె జీవనోపాధి కోసం రూరల్ పరిధిలో ఒక గాజుల బండిని (స్వయం ఉపాధి రథం) సొంత ఖర్చులతో బహూకరించారు.
​ఈ ఉపాధి రథాన్ని శుక్రవారం మండల పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు తన అమృత హస్తాలతో రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవడం అభినందనీయమన్నారు. పార్టీ క్యాడర్ ఎల్లప్పుడూ ప్రజా సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చిరంజీవిని ఆయన ప్రత్యేకంగా అభినందించి, ఆశీస్సులు అందజేశారు. పేద కుటుంబానికి ఉపాధి మార్గం చూపిన నేతలకు స్థానికులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
​కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు:
​ఈ కార్యక్రమంలో సాగర్ల కృష్ణవేణి (మండల సమైక్య అధ్యక్షురాలు), ​కనతల రామకృష్ణ (వత్సవాయి గ్రామ పార్టీ అధ్యక్షులు)
​నారపోగు కొండ (అల్లూరుపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు), కాకాని బాలకృష్ణ (మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు), గడ్డం నాగరాజు పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.