జగ్గయ్యపేట: ఎన్.టి.ఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, ముక్త్యాల గ్రామములో వేంచేసియున్న శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సంబంధించిన భూములకు వచ్చే నెల (జూలై) 3వ తేదీ శుక్రవారం నాడు సీల్డ్ టెండరు-కం-బహిరంగ కౌలు వేలం పాటలు నిర్వహించనున్నట్లు దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ శ్రీమతి వెలగపూడి లక్ష్మణఇందిరా దత్తు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
కంచల గ్రామ భూములు (1 సంవత్సరం కాలపరిమితి):
నందిగామ మండలం, కంచల గ్రామములోని దేవస్థానానికి చెందిన మెరక భూములు ‘4’ బిట్లు (మొత్తం ఎకరాలు 8.27 సెంట్లు) ఒక సంవత్సర కాలపరిమితికి గాను జూలై 3న శుక్రవారం ఉదయం 10.00 గంటల నుండి కంచల గ్రామములోని శ్రీ కదళీకేశ్వర స్వామి వారి దేవస్థాన ఆవరణలో వేలం పాటలు జరుగుతాయి.
నందలూరు గ్రామ భూములు (3 సంవత్సరాల కాలపరిమితి):
అదేవిధంగా వీరులపాడు మండలం, నందలూరు గ్రామములోని మెరక భూములు ‘2’ బిట్లు (మొత్తం ఎకరాలు 12.78 సెంట్లు) మూడు సంవత్సరాల కాలపరిమితికి గాను జూలై 3న శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి నందలూరు గ్రామ పంచాయితీ కార్యాలయ ఆవరణలో వేలం పాటలు నిర్వహిస్తారు. ఈ వేలం పాటలు దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ శ్రీమతి వెలగపూడి లక్ష్మణఇందిరా దత్తు, కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు మరియు దేవదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు, వేలం దారులు నిర్ణీత ధరావత్తు (Earnest Money Deposit) చెల్లించి ఈ బహిరంగ కౌలు వేలం పాటలలో పాల్గొనవచ్చని వారు కోరారు.